'ఇది కచ్చితంగా రాజకీయ దురుద్దేశమే' | YSRCP MP YV Subba reddy takes on TDP Govt | Sakshi
Sakshi News home page

'ఇది కచ్చితంగా రాజకీయ దురుద్దేశమే'

May 30 2015 10:48 AM | Updated on Aug 10 2018 6:21 PM

'ఇది కచ్చితంగా రాజకీయ దురుద్దేశమే' - Sakshi

'ఇది కచ్చితంగా రాజకీయ దురుద్దేశమే'

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుల ఎంపీ ల్యాడ్స్ విషయంలో టీడీపీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఒంగోలు ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వై వి సుబ్బారెడ్డి ఆరోపించారు.

ఒంగోలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుల ఎంపీ ల్యాడ్స్ విషయంలో టీడీపీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఒంగోలు ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వై వి సుబ్బారెడ్డి ఆరోపించారు. శనివారం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎంపీ వై వి సుబ్బారెడ్డి మాట్లాడారు. ఎంపీలు నిధులు మంజూరు చేసినా రాజకీయ ఒత్తిళ్లతో అధికార యంత్రాంగం పనులను గ్రౌండింగ్ చేయడం లేదని విమర్శించారు. ఇది కచ్చితంగా రాజకీయ దురుద్దేశమేనని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైఎస్ఆర్ సీపీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇదే రాజకీయ కుట్ర జరుగుతోందన్నారు. ఎంపీ ల్యాడ్స్ ప్రజలకు చేరకుండా మోకాలడ్డుతుందని ఈ సందర్భంగా టీడీపీపై వై వి సుబ్బారెడ్డి నిప్పులు చెరిగారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి సమగ్రమైన దర్యాప్తు కోరతానని ఆయన వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement