పరిహారం చెల్లింపులోనూ రాజకీయమా? | Yerrabelli Dayakararao fires on cm kcr | Sakshi
Sakshi News home page

పరిహారం చెల్లింపులోనూ రాజకీయమా?

Sep 21 2015 2:46 AM | Updated on Sep 17 2018 5:18 PM

పరిహారం చెల్లింపులోనూ రాజకీయమా? - Sakshi

పరిహారం చెల్లింపులోనూ రాజకీయమా?

రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించే విషయంలోనూ సీఎం కేసీఆర్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని...

సీఎంపై టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించే విషయంలోనూ సీఎం కేసీఆర్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. రైతు రుణాలను రూ.లక్ష వరకూ ఒకేసారి రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర టీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు తదితరులు ఆదివారం ఎర్రబెల్లి నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం ఎర్రబెల్లి విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై 22వ తేదీన కేంద్ర వ్యవసాయ మంత్రిని కలవనున్నామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement