నవంబర్ నుంచి మహిళా బ్యాంక్ కార్యకలాపాలు | Women’s bank likely to begin operations on November | Sakshi
Sakshi News home page

నవంబర్ నుంచి మహిళా బ్యాంక్ కార్యకలాపాలు

Sep 19 2013 2:47 AM | Updated on Oct 17 2018 4:53 PM

నవంబర్ నుంచి మహిళా బ్యాంక్ కార్యకలాపాలు - Sakshi

నవంబర్ నుంచి మహిళా బ్యాంక్ కార్యకలాపాలు

భారత మహిళా బ్యాంక్ కార్యకలాపాలు ఈ ఏడాది నవంబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

 న్యూఢిల్లీ: భారత మహిళా బ్యాంక్ కార్యకలాపాలు ఈ ఏడాది నవంబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. పూర్తిగా మహిళల కోసమే ఉద్దేశించిన ఈ బ్యాంక్ తాజాగా 115 ఆఫీసర్ ఉద్యోగాలకు మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు ఈ నెల 30లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత,  ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం కావలసిన అర్హతలు. 
 
 ఈ ఏడాది అక్టోబర్ 15 కల్లా ఆరు చోట్ల బ్రాంచీలను ఏర్పాటు చేయాలని భారత మహిళా బ్యాంక్ ప్రయత్నాలు చేస్తోంది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ఇండోర్, గువాహటిల్లో ఈ బ్రాంచీలను ఏర్పాటు చేస్తారు. వీటితో పాటు బెంగళూరు, జైపూర్, లక్నో, మైసూర్‌లో కూడా బ్రాంచీలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ బ్యాంక్ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.1,000 కోట్ల ప్రారంభ పెట్టుబడిని  కేటాయించింది. మహిళల బ్యాంకింగ్ అవసరాలు తీర్చడం, ఆర్థిక సాధికారతకు తోడ్పడం లక్ష్యంగా భారత మహిళా బ్యాంక్ ఏర్పాటు చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement