దుమ్మురేపుతున్న ‘లేడీ సింగం’ ఫొటోలు! | Woman tehsildar photos goes viral | Sakshi
Sakshi News home page

దుమ్మురేపుతున్న ‘లేడీ సింగం’ ఫొటోలు!

Oct 16 2016 6:58 PM | Updated on Sep 4 2017 5:25 PM

దుమ్మురేపుతున్న ‘లేడీ సింగం’ ఫొటోలు!

దుమ్మురేపుతున్న ‘లేడీ సింగం’ ఫొటోలు!

లిక్కర్‌ మాఫియాపై ఒంటరిగా ఉక్కుపాదం మోపారు ఓ మహిళా తహసీల్దార్‌..

లిక్కర్‌ మాఫియాపై ఒంటరిగా ఉక్కుపాదం మోపారు ఓ మహిళా తహసీల్దార్‌.. పోలీసులు వెంట లేకపోయినా వెరవకుండా ఒక్కరే వెళ్లి స్వయంగా అక్రమ మద్యం షాపులపై దాడులు జరిపారు. సాహసోపేతంగా ఆమె చేసిన ఈ రైడ్స్‌ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌ జంజీర్‌ జిల్లాలోని మల్ఖారోడ తాహసీల్దార్‌గా ప్రియాంక బంజారా పనిచేస్తున్నారు. అక్రమార్కులను ధైర్యంగా ఎదుర్కోవడం ద్వారా ఆమె స్థానికంగా ‘లేడీ సింగం’గా పేరొందారు. ఓ గ్రామంలో అక్రమ మద్యం మాఫియా గురించి ఆమెకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన ఆమె.. పోలీసుల సాయం తీసుకోకుండానే.. గ్రామ సిబ్బంది ఇద్దరిని వెంటపెట్టుకొని వెళ్లి ఏకంగా లిక్కర్‌ మాఫియా దుకాణాలపై దాడులు జరిపారు. గ్రామస్తులను పీల్చిపిప్పి చేస్తున్న మద్యం దుకాణాలను మూయించారు. లిక్కర్‌ మాఫియాపై ఆమె చూపిన ధైర్యసాహసాలను స్థానిక గ్రామస్తులు ప్రశంసిస్తుండగా.. ఆమె ఫొటోలు ‘లేడీ సింగం’ పేరిట ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.




Advertisement
 
Advertisement
Advertisement