ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలు!! | Woman gives birth to quintuplets in Bihar | Sakshi
Sakshi News home page

ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలు!!

Sep 21 2013 7:05 PM | Updated on Apr 4 2019 4:44 PM

ఒకే కాన్పులో పంచపాండవులను కనేసిందా తల్లి!! బీహార్లోని నవాడా జిల్లాలో గల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ చిత్రం చోటుచేసుకుంది.

ఎవరికైనా సరే.. నకుల సహదేవుల్లా కవలలు పుట్టడం తెలుసు. మహా అయితే ముచ్చటగా ముగ్గురో, ఇంకా అయితే నలుగురు పుట్టడం వరకు విన్నాం. కానీ ఏకంగా ఒకే కాన్పులో పంచపాండవులను కనేసిందా తల్లి!! బీహార్లోని నవాడా జిల్లాలో గల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ చిత్రం చోటుచేసుకుంది.

అయితే... పుట్టిన ఐదుగురు బిడ్డల్లో ముగ్గురు మాత్రం పుట్టిన కొద్ది సేపటికే ప్రాణాలు కోల్పోయారు. ఒక అబ్బాయి, మరో అమ్మాయి మాత్రం బరువు తక్కువ ఉన్నా ప్రాణాలు నిలబెట్టుకోగలిగారు. అంబికా గ్రామానికి చెందిన ఈ మహిళ ఆరోగ్యం భేషుగ్గా ఉన్నట్లు ఆమెను పరీక్షిస్తున్న వైద్యులు తెలిపారు. ఐదుగురు పిల్లలు పుట్టడంతో చూసేందుకు చాలామంది గ్రామస్థులు ఆస్పత్రి వద్దకు క్యూకట్టినా.. వైద్యులు మాత్రం వారిని అనుమతించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement