ప్రేమించలేదని.. విషం తాగించి చంపారు! | woman given poision forcefully by two youth in karnataka | Sakshi
Sakshi News home page

ప్రేమించలేదని.. విషం తాగించి చంపారు!

Nov 25 2013 9:55 PM | Updated on Sep 2 2017 12:58 AM

తన ప్రేమను నిరాకరించినందుకు ఓ యువతికి తన స్నేహితుడి సాయంతో విషం తాగించి మరీ చంపాడో దుర్మార్గుడు.

తన ప్రేమను నిరాకరించినందుకు ఓ యువతికి తన స్నేహితుడి సాయంతో విషం తాగించి మరీ చంపాడో దుర్మార్గుడు. ఈ దారుణ సంఘటన కర్ణాకటలోని రాయచూరు ప్రాంతం మీరాపుర గ్రామంలో జరిగింది. మహాదేవి అనే యువతి తండ్రికి మానసిక స్థితి సరిగా ఉండేది కాదు. దాంతో ఆమె చిన్నప్పటి నుంచి బంధువుల ఇంట్లో ఉండేది.

పొలం పనులకు వెళ్తున్న ఆమెను పొరుగున నివసించే నాగరాజు, మారెప్ప అనే యువకులు ఆమె వెంటపడి ప్రేమించాలంటూ వేధించేవారు. కానీ అందుకు ఆమె నిరాకరించింది. ఈ విషయాన్ని ఆమె తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పింది. దాంతో వాళ్లు ఆ యువకులను మందలించారు. ఆ యువతిపై కక్ష పెంచుకున్న మారెప్ప.. నాగరాజుతో కలిసి ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం రాత్రి మూత్రవిసర్జన కోసం బయటకు రాగా బలవంతంగా విషం తాగించారు. ఆమెను చికిత్సకు తరలించేలోపే మరణించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement