'ప్రేమికులపై దాడిచేసే హక్కు మీకెవరిచ్చారు?' | who gave you right to attack lovers, supreme court slams Sri Ram Sena | Sakshi
Sakshi News home page

'ప్రేమికులపై దాడిచేసే హక్కు మీకెవరిచ్చారు?'

Aug 31 2015 11:59 AM | Updated on Sep 2 2018 5:24 PM

'ప్రేమికులపై దాడిచేసే హక్కు మీకెవరిచ్చారు?' - Sakshi

'ప్రేమికులపై దాడిచేసే హక్కు మీకెవరిచ్చారు?'

ప్రేమికులపై విచక్షణా రహితంగా దాడులు జరిపే శ్రీరాం సేన సంస్థపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

న్యూఢిల్లీ: పర్యాటక స్థలాలు, పార్కులు తదితర ప్రాంతాల్లో జంటగా కనిపించిన ప్రేమికులపై దాడులకు పాల్పడుతూ తమనుతాము సాంస్కృతిక పరిరక్షకులుగా భావించే శ్రీరాం సేనకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులపై తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది.

గోవా రాష్ట్రంలోకి తన ప్రేవేశాన్ని నిషేధిస్తూ కింది కోర్టులు జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ శ్రీరాం సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ సందర్భంగా ముతాలిక్ తీరును కోర్టు తప్పుపట్టింది. 'ప్రేమికులపై దాడిచేసే హక్కును మీకు ఎవరిచ్చారు?' అని ప్రశ్నించింది.

గడిచిన జూన్ 2న గోవాలోకి ప్రవేశించరాదంటూ ముంబై కోర్టు శ్రీరామ్ సేన చీఫ్ ముతాలిక్ ను ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను కొట్టివేయాల్సిందిగా ముతాలిక్ ఆగస్టులో గోవా కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా నిరాశే ఎదురుకావటంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం నాటి సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ముతాలిక్ ఇక గోవాలో అడుగుపెట్టే అవకాశాలు మృగ్యమైనట్లే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement