'పాకిస్థాన్ కు స్నేహపూర్వక హస్తం' | We have always extended a hand of friendship to pakistan | Sakshi
Sakshi News home page

'పాకిస్థాన్ కు స్నేహపూర్వక హస్తం'

Sep 21 2015 1:25 PM | Updated on Sep 3 2017 9:44 AM

'పాకిస్థాన్ కు స్నేహపూర్వక హస్తం'

'పాకిస్థాన్ కు స్నేహపూర్వక హస్తం'

పాకిస్థాన్, చైనా దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.

జమ్మూ: పాకిస్థాన్, చైనా దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. తాము ఎల్లప్పుడూ పాకిస్థాన్ కు స్నేహపూర్వక హస్తం అందిస్తున్నామని చెప్పారు. దీన్ని పాకిస్థాన్ అందిపుచ్చుకుని చర్యలు చేపట్టాలని కోరారు.

సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించేందుకు సోమవారం ఆయన జమ్మూకశ్మీర్ కు వచ్చారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగుతుంది. అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్ పదేపదే కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతుండడంతో రాజ్ నాథ్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement