రేపటి నుంచి వీశాట్‌ | Visat-2017 from tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి వీశాట్‌

Apr 15 2017 1:02 AM | Updated on Apr 6 2019 8:49 PM

ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు విజ్ఞాన్‌ యూనివర్సిటీ బీటెక్‌ ప్రవేశ పరీక్ష వీశాట్‌–2017 జరుగుతుందని

చేబ్రోలు (పొన్నూరు): ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు విజ్ఞాన్‌ యూనివర్సిటీ బీటెక్‌ ప్రవేశ పరీక్ష వీశాట్‌–2017 జరుగుతుందని అడ్మిషన్స్‌ డీన్‌ వి.రవికుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ వర్సిటీలో ప్రవే శాలకు  ఏపీ, తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా 42 సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు.

ఆయా రాష్ట్రాల నుంచి మొత్తం 42 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులు తమ వర్సిటీలో ఆయా కోర్సుల్లో చేరవచ్చన్నారు.  ఇంటర్, ఎంసెట్, జేఈఈ, వీశాట్‌ తదితర పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు వంద శాతం నుంచి, 25 శాతం వరకు ఫీజు రాయితీ ఉంటుందని రవికుమార్‌ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement