కాచిగూడాలో అదృశ్యమైన బీటెక్‌ విద్యార్థి రాహుల్‌ ఆత్మహత్య | Missing BTech Student Rahul Found Dead in Singarayakonda | Sakshi
Sakshi News home page

కాచిగూడాలో అదృశ్యమైన బీటెక్‌ విద్యార్థి రాహుల్‌ ఆత్మహత్య

Jun 8 2026 10:02 AM | Updated on Jun 8 2026 10:34 AM

Missing BTech Student Rahul Found Dead in Singarayakonda

సాక్షి,ఒంగోలు: కాచిగూడా రైల్వే స్టేషన్‌ నుంచి అదృశ్యమైన బీటెక్‌ విద్యార్థి రాహుల్‌ ఘటన విషాదంతంగా ముగిసింది.  ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రాంతంలో ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.   

గత నెల 27న రాహుల్‌ తన కుటుంబ సభ్యులకు టూర్‌కు వెళ్తున్నాను అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. కాచిగూడాలో శబరి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కిన తర్వాత అతను కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు విస్తృతంగా గాలించినా ఎటువంటి సమాచారం లభించలేదు.

తాజాగా ఒంగోలు సమీపంలోని సింగరాయికొండ వద్ద ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసులు ధృవీకరించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. రాహుల్‌ అదృశ్యం, ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement