'అందుకే ఆ పార్టీపై మరింత వ్యతిరేకత..' | venkaiah naidu fires on congress party | Sakshi
Sakshi News home page

'అందుకే ఆ పార్టీపై మరింత వ్యతిరేకత..'

Aug 7 2015 6:06 PM | Updated on Mar 18 2019 7:55 PM

పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడం వల్ల దేశ ప్రయోజనాలకు కాంగ్రెస్ విఘాతం కల్గిస్తోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడం వల్ల దేశ ప్రయోజనాలకు కాంగ్రెస్ విఘాతం కల్గిస్తోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కాంగ్రెస్కు దేశ ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యంగా మారిపోయాయని ఆయన ఆరోపించారు. గురువారం ఆయన మీడియతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చర్యలతో దేశంపై అనేక దుష్పరిమాణాలు పడుతాయన్నారు.

అదే విధంగా పార్లమెంటులో సుష్మా స్వరాజ్, లలిత్ మోదీ అంశంపై స్పష్టమైన సమాధానం ఇచ్చినట్టు తెలిపారు. కాంగ్రెస్ ఇలాంటి అప్రజాస్వామిక చర్యల వల్లే దేశ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై మరింత వ్యతిరేకత పెరుగుతోందని వెంకయ్యనాయుడు విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement