బీటౌన్‌ కట్టప్ప పొడిచేశాడు! | Varun Dhawan, Prabhas Recreated Iconic Baahubali Moment | Sakshi
Sakshi News home page

బీటౌన్‌ కట్టప్ప పొడిచేశాడు!

Jun 20 2017 11:26 PM | Updated on Sep 5 2017 2:04 PM

బీటౌన్‌ కట్టప్ప పొడిచేశాడు!

బీటౌన్‌ కట్టప్ప పొడిచేశాడు!

కొత్త కట్టప్ప వచ్చాడు. ఈయనది బీటౌన్‌. ఈ కట్టప్పకు జుట్టుంది, ‘బాహుబలి’లో కట్టప్పకు లేదు.

కొత్త కట్టప్ప వచ్చాడు. ఈయనది బీటౌన్‌. ఈ కట్టప్పకు జుట్టుంది, ‘బాహుబలి’లో కట్టప్పకు లేదు. కానీ, మిగతాదంతా సేమ్‌ టు సేమ్‌! ఇద్దరూ చేసిందొక్కటే! ప్రభాస్‌ను వెన్నుపోటు పొడిచారు. వెనక నుంచి కత్తితో ఓ పోటు పొడిచారు. ‘బాహుబలి’లో సత్యరాజ్‌ వెన్నుపోటు సీరియస్‌ అయితే... ఈ బీటౌన్‌ కట్టప్ప కత్తిపోటు సరదా కోసం చేసింది. బీటౌన్‌ అంటే బాలీవుడ్‌.

ఆ కట్టప్ప ఎవరో కాదు... యంగ్‌ హీరో వరుణ్‌ ధావన్‌. ‘బాహుబలి’ హిందీ వెర్షన్‌ విడుదల చేసిన దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌ మొన్న రాత్రి బీటౌన్‌లో ఆయన బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అందర్నీ పిలిచి సక్సెస్‌ పార్టీ ఇచ్చారు. అందులో ఈ ఫన్నీ సీన్‌ చోటు చేసుకుంది. రానా దగ్గుబాటి, వరుణ్‌ ధావన్, ఆలియా భట్‌ తదితరులు ఈ పార్టీలో సందడి చేశారు. ఇంతకీ, ఈ వరుణ్‌ ధావన్‌ ఎవరంటే... ఈవీవీ ‘హలో బ్రదర్‌’ను హిందీలో ‘జుడ్వా’గా రీమేక్‌ చేసిన దర్శకుడు డేవిడ్‌ ధావన్‌ కుమారుడు. ఇప్పుడీ తండ్రీకొడులు ‘హాలో బ్రదర్‌’కి సీక్వెల్‌గా హిందీలో ‘జుడ్వా–2’ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement