'మీడియాలో మైలేజీ కోసమే పోజులిచ్చారు' | v hanumantha rao takes on telangana ministers | Sakshi
Sakshi News home page

'మీడియాలో మైలేజీ కోసమే పోజులిచ్చారు'

Jul 19 2015 3:03 PM | Updated on Sep 19 2019 8:28 PM

'మీడియాలో మైలేజీ కోసమే పోజులిచ్చారు' - Sakshi

'మీడియాలో మైలేజీ కోసమే పోజులిచ్చారు'

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలది ప్రచార ఆర్భాటమేనని కాంగ్రెస్ ఎంపీ వి హనుమంతరావు విమర్శించారు.

హైదరాబాద్: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలది ప్రచార ఆర్భాటమేనని కాంగ్రెస్ ఎంపీ వి హనుమంతరావు విమర్శించారు. పుష్కర ఘాట్లలో సౌకర్యాలు సరిగాలేవని అన్నారు. ప్రజలు పోటెత్తడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయని, మేం కూడా ఇబ్బందులు పడ్డామని వీహెచ్ చెప్పారు.

తెలంగాణ మంత్రులు మీడియా మైలేజీ కోసమే ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తున్నట్టు పోజులిచ్చారని వీహెచ్ విమర్శించారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయంపై గవర్నర్ నరసింహన్ను ఎన్నిసార్లుగా అడిగినా స్పందించలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వీహెచ్ ఆరోపించారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రశ్నిస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement