అత్యవసరంగా విమానం దించివేత | United Bangladesh plane makes emergency landing at Raipur | Sakshi
Sakshi News home page

అత్యవసరంగా విమానం దించివేత

Aug 7 2015 10:22 PM | Updated on Sep 3 2017 6:59 AM

బంగ్లాదేశ్కు చెందిన ఓ విమానాన్ని అత్యవసరంగా దించివేశారు. ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఉన్నపలంగా ల్యాండింగ్ చేశారు

రాయ్ పూర్: బంగ్లాదేశ్కు చెందిన ఓ విమానాన్ని అత్యవసరంగా దించివేశారు. ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఉన్నపలంగా ల్యాండింగ్ చేశారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి మస్కట్కు బయలుదేరిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ గుర్తించారు.

దీంతో భారత వైమానిక అధికారులను సంప్రదించిన పైలట్ రాయ్ పూర్ లోని వివేకానంద విమానాశ్రయంలో సురక్షితంగా దించివేశారు.  సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో విమానాన్ని దించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో మొత్తం 173 మంది ప్రయాణీకులు ఉన్నారు.  వారిని ఏయే ప్రాంతాలకు చేర్చే విషయాన్ని భారత అధికారులు బంగ్లా అధికారులతో సంప్రదిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement