పెషావర్ దాడిని ఖండించిన ఐక్యరాజ్యసమితి | UN chief condemns Pakistan school attack | Sakshi
Sakshi News home page

పెషావర్ దాడిని ఖండించిన ఐక్యరాజ్యసమితి

Dec 16 2014 10:50 PM | Updated on Sep 2 2017 6:16 PM

పెషావర్ లో ఉగ్రవాదుల దాడిని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్కీ మూన్ ఖండించారు.

ఐక్యరాజ్యసమితి: పెషావర్ లో ఉగ్రవాదుల దాడిని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్కీ మూన్ ఖండించారు. ఉగ్రవాదులు పాల్పడిన కిరాతకానికి కారణమే లేదని పేర్కొన్నారు. పాఠశాలలో చదువుకునేందుకు వచ్చిన అమాయక పిల్లలపై పాశవికంగా దాడి చేయడం దారుణమన్నారు.

దాడిలో మృతి చెందిన వారి కుటుంబాల వెంటే ప్రపంచంలోని అందరి హృదయాలు ఉన్నాయని పేర్కొన్నారు. దాడికి కారణమైన వారిని చట్టం ముందు నిలబెట్టేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాలని బాన్కీమూన్ కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement