మావోయిస్టులకు ఆయుధాలు సరఫరాచేస్తున్న ఇద్దరిని విశాఖ జిల్లా పాడేరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పాడేరు: అక్రమ మార్గంలో మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా చేస్తున్న ఇద్దిరిని విశాఖ జిల్లా పాడేరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంచంగిపుట్టు ఏజెన్సీ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో ద్విచక్ర వాహనంపై అటుగా వెళ్తున్న ముగ్గురు అనుమానితులను పోలీసులు అడ్డుకున్నారు. వారిలో ఒకరు తప్పించుకోగా, ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడ్డ ఇద్దరూ గంజాయి స్మగ్లర్లని, మావోయిస్టులకు ఆయుధాలు కూడా సరఫర చేసేవారని పోలీసులు చెప్పారు. వారి నుంచి ఒక దేశవాళీ తుపాకీని స్వాధీనం చేసుకున్నామని, నిందితులను రిమాండ్ కు తరలించనున్నట్లు పేర్కొన్నారు.