శ్రీవారి లడ్డూ బరువు తగ్గింది | Tirumala laddu loses weight | Sakshi
Sakshi News home page

శ్రీవారి లడ్డూ బరువు తగ్గింది

Aug 26 2015 6:17 PM | Updated on Aug 28 2018 5:54 PM

శ్రీవారి లడ్డూ బరువు తగ్గింది - Sakshi

శ్రీవారి లడ్డూ బరువు తగ్గింది

తిరుమల శ్రీవారి లడ్డూ బరువు తక్కువగా ఉంటోంది. టీటీడీ నిబంధన ప్రకారం రూ.25కు విక్రయించే లడ్డూ బరువు 175 గ్రాములు ఉండాలి.

తిరుమల : తిరుమల శ్రీవారి లడ్డూ బరువు తక్కువగా ఉంటోంది. టీటీడీ నిబంధన ప్రకారం రూ.25కు విక్రయించే లడ్డూ బరువు 175 గ్రాములు ఉండాలి. అయితే బుధవారం భక్తులకు అందజేసిన లడ్డూలో ఒక్కొక్కటి కేవలం 146 నుంచి 150 గ్రాముల లోపే ఉన్నాయి. లడ్డూ బరువుపై అవగాహన ఉన్న భక్తులు కౌంటర్ సిబ్బందిని ప్రశ్నించగా ఆలయంలో తయారు చేసిన లడ్డూలకు, తమకు సంబంధం లేదని సమాధానం ఇచ్చారు.

మరి కొందరు భక్తులు మాత్రం చేతికి అందిన లడ్డూ మహాప్రసాదంగా తీసుకెళ్లారు. ఇటీవల కాలంలో లడ్డూ బరువు, పరిమాణం తగ్గుతూ ఉండడంతో భక్తులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement