పోలీసులకు స్పైడర్ మాన్ పంచ్ | Times Square Spider-Man Punching Cop During Arrest | Sakshi
Sakshi News home page

పోలీసులకు స్పైడర్ మాన్ పంచ్

Jul 28 2014 9:03 AM | Updated on Aug 24 2018 8:18 PM

పోలీసులకు స్పైడర్ మాన్ పంచ్ - Sakshi

పోలీసులకు స్పైడర్ మాన్ పంచ్

ఓవర్ యాక్షన్ చేసిన స్పైడర్ మాన్కు అమెరికా పోలీసులు కళ్లెం వేశారు. అయితే అతగాడు నిజమైన స్పైడర్ మాన్ కాదండోయ్.

ఓవర్ యాక్షన్ చేసిన స్పైడర్ మాన్కు అమెరికా పోలీసులు కళ్లెం వేశారు. అయితే అతగాడు నిజమైన స్పైడర్ మాన్ కాదండోయ్. అతడిలా దుస్తులు వేసుకున్నాడంతే. అక్కడితో ఊరుకోకుండా మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. అంతేకాదు పోలీసులపై తన ప్రతాపం చూపాడు. న్యూయార్క్ టైమ్ స్వ్కేర్ వద్ద చోటుచేసుకున్న ఘటన గురించి న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది.

స్పైడర్ మాన్ వేషంలో ఉన్న వ్యక్తిని జూనియర్ బిషప్(25)గా గుర్తించారు. న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద తనతో ఫోటో దిగేందుకు వచ్చిన మహిళతో బిషప్ గొడవకు దిగాడు. స్పైడర్ మాన్ వేషంలో ఉన్న అతడిని పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించగా పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఓ పోలీసు ముఖానికి గాయాలవడంతో అతడికి న్యూయార్క్ మెడికల్ సెంటర్ లో చికిత్స అందించారు.

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద వివిధ వేషాలు వేసుకుని విరాళాలు సేకరించడం సాధారణం. పర్యాటకుల పట్ల కొంత మంది అతిగా ప్రవర్తించి జైలు పాలవుతున్నారు. నెల క్రితం ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మరో స్పైడర్ మాన్ జైలు పాలయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement