చిన్నారిపై అత్యాచారం కేసులో కీచక ఎస్సైలు అరెస్ట్ | Three policemen arrested and suspended for molesting girl | Sakshi
Sakshi News home page

చిన్నారిపై అత్యాచారం కేసులో కీచక ఎస్సైలు అరెస్ట్

Jan 4 2014 3:17 PM | Updated on Jul 23 2018 8:49 PM

చిన్నారిపై అత్యాచారం కేసులో కీచక ఎస్సైలు అరెస్ట్ - Sakshi

చిన్నారిపై అత్యాచారం కేసులో కీచక ఎస్సైలు అరెస్ట్

12 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపిన ముగ్గురు ఖాకీ కీచకులను అరెస్ట్ చేసినట్లు షిల్లాంగ్ జిల్లా ఎస్పీ ముఖేష్ సింగ్ శనివారం ఇక్కడ వెల్లడించారు.

12 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపిన ముగ్గురు ఖాకీ కీచకులను అరెస్ట్ చేసినట్లు షిల్లాంగ్ జిల్లా ఎస్పీ ముఖేష్ సింగ్ శనివారం ఇక్కడ వెల్లడించారు.  మేఘాలయాలోని పశ్చిమ గారో పర్వత ప్రాంతంలో ఆ ముగ్గురు నిందితులను నిన్న రాత్రి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కోర్టులో హాజరుపరచగా నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారని చెప్పారు. కాగా నిందితులు ఒకరు ఎస్ఐలుగా విధులు నిర్వర్తిస్తుండగా, మరో ఇద్దరు ప్రొబిహిషన్ పిరియడ్లో ఉన్నారని తెలిపారు.

 

అయితే ఆ ముగ్గురు నిందితులను విధుల నుంచి ఇప్పటికే తొలగించినట్లు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం... గతేడాది డిసెంబర్ 28వ తేదీన 12 ఏళ్ల చిన్నారి తన మేనమామతో కలసి షాపుకు వెళ్లి వస్తుంది. ఆ క్రమంలో మేనమామపై దాడి చేసి తాము తీవ్రవాదులమని చెప్పి, ఆ బాలికపై ఆటో రిక్షాలో అత్యాచారం చేశారు. అనంతరవారిని తురాలోని చాంద్మరి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు.

 

కొన్ని తెల్లపేపర్లపై బాధితులు ఇద్దరి వద్ద నుంచి సంతకాలు తీసుకుని, ఆ విషయం ఎక్కడైనా చెబితే చంపెస్తామని బెదిరించారు. దాంతో బాధితురాలు తన తల్లితండ్రులను ఆశ్రయించారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికపై అత్యాచార ఘటనపై మహిళ పోలీసులు ఉన్నతాధికారితో విచారణ జరిపిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ముఖేష్ సింగ్ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement