'చంద్రబాబు తప్పు మీద తప్పులు చేస్తున్నాడు' | Talasani srinivasa yadav slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు తప్పు మీద తప్పులు చేస్తున్నాడు'

Jul 19 2015 11:25 PM | Updated on Sep 3 2017 5:48 AM

'చంద్రబాబు తప్పు మీద తప్పులు చేస్తున్నాడు'

'చంద్రబాబు తప్పు మీద తప్పులు చేస్తున్నాడు'

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు మీద తప్పులు చేస్తున్నాడని సినిమా ఆటోగ్రాఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ విమర్శించారు.

ఖమ్మం(పాల్వంచ): ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు మీద తప్పులు చేస్తున్నాడని సినిమా ఆటోగ్రాఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ విమర్శించారు. ఖమ్మం జిల్లా పాల్వంచలోని స్థానిక కాంట్రాక్టు కాలనీలో 1104 యూనియన్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎస్. జంగయ్య నివాసానికి మంత్రి ఆదివారం సాయంత్రం వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో దొరికిన చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ మరిన్ని తప్పుడు పనులు చేస్తున్నాడని ఆరోపించారు.

చంద్రబాబు నిర్లక్ష్యం, ప్రచార ఆర్భాటం కారణంగా రాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాలకు వెళ్లిన భక్తులు ప్రాణాలు విడవాల్సి వచ్చిందన్నారు. తెలంగాణలో గోదావరి పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. కిన్నెరసానిని అభివృద్ధి చేస్తానని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement