సల్మాన్‌ఖాన్‌ ఇస్లామిక్‌ స్టేట్‌ ఏజెంట్‌! | swamy om comments on salman khan | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ఖాన్‌ ఇస్లామిక్‌ స్టేట్‌ ఏజెంట్‌!

Jan 7 2017 6:42 PM | Updated on Jul 18 2019 1:41 PM

'బాస్‌-10' రియాల్టీ షో కంటెస్టెంట్‌ స్వామి ఓం బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

ముంబై: 'బాస్‌-10' రియాల్టీ షో కంటెస్టెంట్‌ స్వామి ఓం బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. సల్మాన్‌ఖాన్‌కు అండర్‌ వరల్డ్‌ ముఠాతో సంబంధాలు ఉన్నాయని, ఆయన ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రవాద సంస్థ ఏజెంట్‌ అని ఆరోపణలతో చెలరేగిపోయారు. కలర్స్‌ హిందీ చానల్లో ప్రసారమయ్యే ఈ రియాల్టీ షో నుంచి తనను తప్పించేందుకు తమ జట్టుపై మూత్రం పోశారని స్వామి ఓం ఆరోపించారు.

ఇటీవల 'బిగ్‌బాస్‌' షో నుంచి స్వామి ఓంను తప్పించారు. దీంతో ఆయన ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారని, ఒక్కసారి  షోలో పాల్గొన్న వారు తిరిగి మూడు నెలల వరకు పాల్గొనేందుకు అవకాశముండదని షో నిర్వాహకులు అంటున్నారు. స్వామి ఓం చేసిన ఆరోపణలు వ్యక్తిగతమేనని పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement