ఆ ఆట ప్రాణం తీసింది..! | student brutal murded in chennai | Sakshi
Sakshi News home page

ఆ ఆట ప్రాణం తీసింది..!

Aug 17 2017 6:52 PM | Updated on Sep 17 2017 5:38 PM

ఆ ఆట ప్రాణం తీసింది..!

ఆ ఆట ప్రాణం తీసింది..!

క్రికెట్‌ ఆటలో తలెత్తిన వివాదంతో తిరుచ్చిలో ఓ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు

చెన్నై: మిత్రులతో కలిసి సరదాగ ఓ విద్యార్థి క్రికెట్‌ ఆడాడు. వారి మధ్య క్రికెట్‌ ఆటలో తలెత్తిన వివాదంతో తిరుచ్చిలో ఓ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలివీ.. పొన్‌మలైకు చెందిన జయకుమార్‌ రైల్వే ఉద్యోగం చేస్తూ మూడేళ్ల క్రితం మరణించాడు. ఇతని భార్య శాంతి కార్పొరేషన్‌ ఉద్యోగి. ఈ దంపతుల కుమారుడు కార్తికేయన్‌(17) ప్లస్‌టూ చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం అదే ప్రాంతంలో గల తన మిత్రులతో కలిసి క్రికెట్‌ ఆడాడు. అనంతరం ఇంటికి వెళ్లుతున్నప్పుడు రైల్వే గేట్‌ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేశారు.

కార్తికేయన్‌ను కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసి పారిపోయారు. రైల్వే గేటు వద్ద విగల జీవుడిగా పడి ఉన్న కార్తికేయన్‌ను చూసి స్థానికులు తల్లికి చెప్పారు. పరుగున అక్కడికి చేరుకున్న తల్లి కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. సమాచారం అందుకున్న పొన్మలై పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు.

కేసు నమోదు చేసి పోలీసులు హత్య చేసిన హంతకుల కోసం గాలిస్తున్నారు. క్రికెట్‌ సందర్భంగా చెలరేగిన వివాదంతో కార్తికేయన్‌ను అతని మిత్రుడే చంపి ఉంటాడని బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అక్కడికి వచ్చిన వారు ఆగ్రహించి మిత్రుడి ఇంటిని ధ్వంసం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement