ఐటీ కారిడార్‌లో ప్రత్యేక తనిఖీలు | Special checking on IT caridar | Sakshi
Sakshi News home page

ఐటీ కారిడార్‌లో ప్రత్యేక తనిఖీలు

Aug 11 2015 6:08 PM | Updated on Sep 3 2017 7:14 AM

ఐటీ కారిడార్‌లో మంగళవారం పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

గచ్చిబౌలి(హైదరాబాద్): ఐటీ కారిడార్‌లో మంగళవారం పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా దేశంలోని ప్రధాన పట్టణాలలో తీవ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉందని నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేయడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

శిల్పారామంలో బాంబు స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించింది. ఇనార్బిట్ మాల్‌తో పాటు జనసంద్రం ఎక్కువ ఉండే ప్రాంతాల్లో నిరంతరం తనిఖీలు చేపట్టనున్నారు. మాదాపూర్ జోన్ పరిధిలో తనిఖీలు కొనసాగించేందుకు ప్రత్యేక బాంబుస్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా స్థానిక పోలీసుల పర్యవేక్షణలో తనిఖీలు కొనసాగుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement