స్థిరంగా సోనియాగాంధీ ఆరోగ్యం | Sonia Gandhi's health stable | Sakshi
Sakshi News home page

స్థిరంగా సోనియాగాంధీ ఆరోగ్యం

Aug 3 2016 7:54 PM | Updated on Oct 22 2018 9:16 PM

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఏఐసీసీ మీడియా విభాగం ఇన్‌చార్జి రణ్‌దీప్ సుర్జేవాలా బుధవారం తెలిపారు.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఏఐసీసీ మీడియా విభాగం ఇన్‌చార్జి రణ్‌దీప్ సుర్జేవాలా బుధవారం తెలిపారు. ప్రస్తుతం ఆమెకు గంగారామ్ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని వెల్లడించారు. తీవ్రమైన జ్వరం కారణంగా మంగళవారం వారణాసిలో తన రోడ్‌షోను సోనియాగాంధీ అర్ధంతరంగా ముగించిన విషయం తెలిసిందే.

 

అక్కడి నుంచి ఆమె చార్టెడ్ విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. వెంటనే ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరెల్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం పరిస్థితి మెరుగవడంతో ఆమెను గంగారామ్ ఆసుపత్రికి మార్చినట్లు సుర్జేవాలా చెప్పారు. తను అనారోగ్యం నుంచి కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ సోనియాగాంధీ ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపినట్లు ఆయన చెప్పారు. కాగా, సోనియా వద్ద ప్రస్తుతం ఆమె కుమారుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కూతురు ప్రియాంకా గాంధీ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement