పాకిస్థాన్లో ఓ ఆరేళ్ల బాలుడిని లైంగిక దాడి కేసులో కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.
పాకిస్థాన్లో ఓ ఆరేళ్ల బాలుడిని లైంగిక దాడి కేసులో కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. నాదియా అఖ్తర్ అనే మహిళ ఫిర్యాదు మేరకు హసన్, అతడి తమ్ముడు హస్నియాన్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోదరులిద్దరూ తనపై ఇనుప రాడ్తో దాడి చేశారని, తన మానమర్యాదలకు భంగం కలిగేలా ప్రవర్తించారని ఆ మహిళ ఆరోపించారు. ఈ కేసులో హసన్ ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. అయితే హస్నైన్ మాత్రం కోర్టు ఎదుట తన న్యాయవాదితో హాజరై, బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరాడు.
అసలు మైనర్ మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం ద్వారా పోలీసులు తప్పు చేశారని అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి నవీద్ ఇక్బాల్ అభిప్రాయపడ్డారు. ఏడేళ్లలోపు పిల్లలను ఎలాంటి నేరం కింద బుక్ చేయకూడదని పీపీసీ సెక్షన్ 82 చెబుతోందని ఆయన అన్నారు. దాంతో హస్నైన్కు ఈ కేసు నుంచి పూర్తిగా విముక్తి కలిగించారు. వెంటనే ఎఫ్ఐఆర్ను రద్దుచేసి, సంబంధిత జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వద్ద నివేదిక సమర్పించాలని దర్యాప్తు అధికారికి సూచించారు.