నగరంలో 'కీచక' పీఈటీ.. ! | sexual harassment on girl students | Sakshi
Sakshi News home page

నగరంలో 'కీచక' పీఈటీ.. !

Jan 28 2017 11:40 AM | Updated on Jul 23 2018 8:49 PM

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు 'కీచక' అవతారం ఎత్తాడు.

హైదరాబాద్‌: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు 'కీచక' అవతారం ఎత్తాడు. అభంశుభం తెలియని బాలికల పట్ల అసభ్యంగా వ్యవహరించాడు. దీంతో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన అతడిపై చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. నగరంలోని ఎల్బీనగర్‌ బండ్లగూడలో శనివారం ఈ ఘటన వెలుగుచూసింది.

ఓ ప్రైవేటు పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న రాజా గతకొంతకాలంగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, వారిని లైంగికంగా వేధిస్తున్నాడని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు శనివారం పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. వారికి పలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పీఈటీని అదపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement