లారీ- జీపు ఢీ: ఏడుగురు మృతి | Seven killed, 14 injured in road accident | Sakshi
Sakshi News home page

లారీ- జీపు ఢీ: ఏడుగురు మృతి

Apr 24 2014 9:46 AM | Updated on Aug 30 2018 3:58 PM

ఒడిశాలోని కేంద్రపడ జిల్లా చాందోల్ వద్ద గురువారం లారీ - జీపు ఢీ కొన్నాయి. ఆ దుర్ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.

ఒడిశాలోని కేంద్రపడ జిల్లా చాందోల్ వద్ద గురువారం లారీ - జీపు ఢీ కొన్నాయి. ఆ దుర్ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

 

వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతులలో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. వివాహానికి హాజరై తిరిగి వస్తున్న క్రమంలో ఆ దుర్ఘటన చోటు చేసుకుందని పోలీసులు వివరించారు. మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement