మహిళా ఎస్ఐపై లారీ ఎక్కించి చంపేందుకు యత్నం | Sand Mafia, Murder attempt on woman SI | Sakshi
Sakshi News home page

మహిళా ఎస్ఐపై లారీ ఎక్కించి చంపేందుకు యత్నం

Mar 28 2014 8:44 AM | Updated on Aug 28 2018 8:41 PM

తమిళనాడు తిరునెల్వేలి సమీపంలో మహిళా ఎస్ఐపై లారీ ఎక్కించి చంపేందుకు ప్రయత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

చెన్నై : తమిళనాడు తిరునెల్వేలి సమీపంలో మహిళా ఎస్ఐపై లారీ ఎక్కించి చంపేందుకు ప్రయత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరునెల్వేలి సమీపంలోగల గంగైకొండాన్ సిట్రారు ప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సమాచారం మేరకు  గంగైకొండాన్ ఎస్ఐ ధనలక్ష్మి ఆధ్వర్యంలో పోలీసు బృందం నిన్న తెల్లవారుజామున మూడు గంటల సమయంలో సిప్కాట్ ప్రాంతంలో తనిఖీలు జరిపారు. ఆ సమయంలో ఒక టిప్పర్ లారీని ఆపేందుకు ప్రయత్నించారు.

అయితే డ్రైవర్ లారీని ఆపకుండా ఎస్ఐ ధనలక్ష్మిపై లారీ ఎక్కించేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో సహ పోలీసులు సినిమా ఫక్కీలో లారీని జీపులో వెంబడించారు. లారీని డ్రైవర్ ఒకచోట నిలిపి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. సీవలప్పేరికి చెందిన కరుప్పస్వామి, పాలయంకోట్టైకు చెందిన మురుగున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement