అనూహ్య ప్రమాదంలో ప్రేమజంట దుర్మరణం | russian couple drown into a lake while they had sex | Sakshi
Sakshi News home page

కారులో శృంగారం.. ప్రేమజంట దుర్మరణం

Jun 20 2017 5:46 PM | Updated on Sep 5 2017 2:04 PM

అనూహ్య ప్రమాదంలో ప్రేమజంట దుర్మరణం

అనూహ్య ప్రమాదంలో ప్రేమజంట దుర్మరణం

స్కూల్‌ టీచరైన ఎవిజనీ చెర్నోవ్‌(22), అతని ప్రియురాలు యానా క్ర్యుచ్‌కోవా(22)లు అనూహ్యరీతిలో దుర్మణం చెందిన వార్త వైరల్‌ అయింది.

వోలోగ్రాడ్‌: ఓ స్కూలులో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌(పీఈటీ)గా పనిచేస్తోన్న 22ఏళ్ల యువకుడు, అంతే వయసున్న అతని గర్ల్‌ఫ్రెండ్‌ అనూహ్యరీతిలో దుర్మణం చెందిన వార్త వైరల్‌ అయింది. రష్యాలోని వోలోగ్రాడ్‌ ప్రాంతానికి చెందిన ఈ జంట.. శృంగారకలాపం సాగిస్తుండగా కారు నీటమునిగి దుర్మరణం చెందారు. స్థానిక పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..

స్కూల్‌ టీచరైన ఎవిజనీ చెర్నోవ్‌(22), అతని ప్రియురాలు యానా క్ర్యుచ్‌కోవా(22)లు ఆదివారం కారులో విహారయాత్రకు వెళ్లారు. వొలోగ్రాడ్‌ నగర శివారులోని ఓ సరస్సు గట్టుమీద కారు ఆపి కాసేపు మాట్లాడుకున్నారు. ఆపై కారు వెనుక సీట్లోకివెళ్లి శృంగారంలో పాల్గొన్నారు. న్యూట్రల్‌ గేరులో ఉన్న కారు.. కుదుపులకు లోనుకావడంతో ఒక్కసారిగా సరస్సులోకి దూసుకెళ్లింది. కారు నీటమునగడం, అందులోనుంచి బయటికిరాలేని ప్రేమికులు దుర్మరణం చెందడం నిమిషాల్లో జరిగిపోయింది.

ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. నీటి అడుగుభాగం నుంచి కారును వెలికితీశారు. విగతజీవులైన ప్రేమికులిద్దరి కుటుంబాలకు సమాచారం అందించారు. ప్రేమికులు ఉపయోగించింది నివా(రష్యన్‌ మేడ్‌) కారని, కుదుపుల కారణంగానే అది సరస్సులోకి దూసుకెళ్లిందన్న పోలీసులు.. ఈ వ్యవహారంలో కారు తయారీదార్లను కూడా ప్రశ్నించనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement