కొంతకాలంగా రేవంత్పై డేగ కన్ను ఉంది | Revanth reddy surveillance camera on kcr govt, says yanamala ramakrishna | Sakshi
Sakshi News home page

కొంతకాలంగా రేవంత్పై డేగ కన్ను ఉంది

Jun 2 2015 12:47 PM | Updated on Aug 27 2018 8:44 PM

కొంతకాలంగా రేవంత్పై డేగ కన్ను ఉంది - Sakshi

కొంతకాలంగా రేవంత్పై డేగ కన్ను ఉంది

ఓటుకు నోటు కేసులో తెలంగాణ టీడీఎల్పీ ఉపనేత రేవంత్రెడ్డి అరెస్ట్పై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు.

విశాఖపట్నం: ఓటుకు నోటు కేసులో తెలంగాణ టీడీఎల్పీ ఉపనేత రేవంత్రెడ్డి అరెస్ట్పై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. రేవంత్రెడ్డిని కేసీఆర్ ప్రభుత్వం కావాలనే ఇరికించిందని ఆరోపించారు. తెలంగాణలో కొంతకాలంగా రేవంత్రెడ్డిపై డేగ కన్ను ఉందని యనమల తెలిపారు. రేవంత్ రెడ్డికి సంబంధించిన వీడియోలు ఫోరెన్సిక్ ల్యాబ్లో చూపిస్తే తెలుస్తుందన్నారు.

మంగళవారం విశాఖపట్నంలో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో యనమల పాల్గొన్నారు. అనంతరం రేవంత్రెడ్డి అరెస్ట్పై యనమలపై విధంగా స్పందించారు. అయితే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కేంద్ర పరిశీలనలో ఉందన్నారు. ఇదే విషయంపై కేంద్రప్రభుత్వాన్ని నిరంతరాయంగా అడుగుతున్నామని యనమల రామకృష్ణుడు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement