breaking news
ttdlp leader
-
టీడీఎల్పీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్
హైదరాబాద్ : టీడీఎల్పీ నాయకుడిగా రేవంత్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రేవంత్‌తో ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, సండ్ర వెంకట వీరయ్య, ఏ గాంధీ సమావేశమయ్యారు. టీఆర్ఎస్లో తమను విలీనం చేయాలంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు ఎర్రబెల్లి ఇచ్చిన లేఖపై ఈ సందర్భంగా వారు చర్చిస్తున్నారు. ఇప్పటి వరకు టీడీఎల్పీ నాయకుడిగా ఉన్న ఎర్రబెల్లి దయాకరరావు టీడీపీకి రాజీనామా చేసి... ఇటీవలే టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తమను టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయాలంటూ అసెంబ్లీ స్పీకర్‌కి ఆయన లేఖ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు టీడీఎల్పీ ఉప నాయకుడిగా ఉన్న రేవంత్‌రెడ్డిని టీడీఎల్పీ నాయకుడిగా ఎంపిక చేశారు. -
కొంతకాలంగా రేవంత్‌పై డేగ కన్ను ఉంది
విశాఖపట్నం: ఓటుకు నోటు కేసులో తెలంగాణ టీడీఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డి అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. రేవంత్‌రెడ్డిని కేసీఆర్ ప్రభుత్వం కావాలనే ఇరికించిందని ఆరోపించారు. తెలంగాణలో కొంతకాలంగా రేవంత్‌రెడ్డిపై డేగ కన్ను ఉందని యనమల తెలిపారు. రేవంత్ రెడ్డికి సంబంధించిన వీడియోలు ఫోరెన్సిక్ ల్యాబ్‌లో చూపిస్తే తెలుస్తుందన్నారు. మంగళవారం విశాఖపట్నంలో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో యనమల పాల్గొన్నారు. అనంతరం రేవంత్‌రెడ్డి అరెస్ట్‌పై యనమలపై విధంగా స్పందించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కేంద్ర పరిశీలనలో ఉందన్నారు. ఇదే విషయంపై కేంద్రప్రభుత్వాన్ని నిరంతరాయంగా అడుగుతున్నామని యనమల రామకృష్ణుడు తెలిపారు.