టీడీఎల్పీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ | Revanth Reddy To Take Up Charge TTDLP Leader | Sakshi
Sakshi News home page

టీడీఎల్పీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్

Feb 12 2016 3:30 PM | Updated on Sep 3 2017 5:31 PM

టీడీఎల్పీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్

టీడీఎల్పీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్

టీడీఎల్పీ నాయకుడిగా రేవంత్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో బాధ్యతలు స్వీకరించారు.

హైదరాబాద్ : టీడీఎల్పీ నాయకుడిగా రేవంత్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రేవంత్తో ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, సండ్ర వెంకట వీరయ్య, ఏ గాంధీ సమావేశమయ్యారు. టీఆర్ఎస్లో తమను విలీనం చేయాలంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు ఎర్రబెల్లి ఇచ్చిన లేఖపై ఈ సందర్భంగా వారు చర్చిస్తున్నారు. 

ఇప్పటి వరకు టీడీఎల్పీ నాయకుడిగా ఉన్న ఎర్రబెల్లి దయాకరరావు టీడీపీకి రాజీనామా చేసి... ఇటీవలే టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తమను టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయాలంటూ అసెంబ్లీ స్పీకర్కి ఆయన లేఖ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు టీడీఎల్పీ ఉప నాయకుడిగా ఉన్న రేవంత్రెడ్డిని టీడీఎల్పీ నాయకుడిగా ఎంపిక చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement