‘ఇరాకు బ్రాండ్ అంబాసిడర్ గుర్తింపు హర్షణీయం’ | 'Recognition of the brand ambassador of the Iraqi harsaniyam' | Sakshi
Sakshi News home page

‘ఇరాకు బ్రాండ్ అంబాసిడర్ గుర్తింపు హర్షణీయం’

Jul 22 2015 12:36 AM | Updated on Sep 3 2017 5:54 AM

‘ఇరాకు బ్రాండ్ అంబాసిడర్  గుర్తింపు హర్షణీయం’

‘ఇరాకు బ్రాండ్ అంబాసిడర్ గుర్తింపు హర్షణీయం’

వికలాంగులకు సానుభూతి అవసరం లేదని.. అర్థం చేసుకునే సమాజం కావాలని మెట్రో ైరైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్: వికలాంగులకు సానుభూతి అవసరం లేదని.. అర్థం చేసుకునే సమాజం కావాలని మెట్రో ైరైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి అన్నారు. ఇరా సిం ఘాల్‌ను కేంద్రం బ్రాండ్ అంబాసిడర్‌గా గుర్తించటం హర్షణీయమన్నారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో సివిల్స్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ ఇరా సింఘాల్‌కు అభినందన సభ జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎన్‌వీఎస్ రెడ్డి మాట్లాడుతూ సకలాంగులకంటే వికలాంగులు దేనిలో తీసిపోరని సింఘాల్ నిరూపించారన్నారు. అంగవైకల్యం మన శక్తికి ఆటంకం కాదని ఇరా సింఘాల్ నిరూపించారని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఇరా సింఘాల్ మాట్లాడుతూ వైకల్యం సామర్థ్యానికి అడ్డుకాదన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement