ఇన్ఫోసిస్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా అల్కరాజ్‌ | Tennis Star Carlos Alcaraz Appointed as Infosys Global Brand Ambassador | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా అల్కరాజ్‌

Apr 16 2026 6:34 PM | Updated on Apr 16 2026 6:49 PM

Tennis Star Carlos Alcaraz Appointed as Infosys Global Brand Ambassador

న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఏడు సార్లు గ్రాండ్‌ శ్లామ్‌ చాంపియన్‌గా నిల్చిన టెన్నిస్‌ దిగ్గజం కార్లోస్‌ అల్కరాజ్‌ని తాజాగా తమ గ్లోబల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. దీనితో పాటు ఏఐ ఆధారిత మ్యాచ్‌ అనలిటిక్స్, మ్యాచ్‌ల కోసం సన్నద్ధం కావడానికి వ్యక్తిగత స్థాయిలో పనితీరును మదింపు చేసేందుకు ఉపయోగపడే అప్లికేషన్‌ని ఆయన తో కలిసి తమ ఏఐ సాంకేతికత టొపాజ్‌ సహా యంతో అభివృద్ధి చేయనున్నట్లు వివరించింది.

అలాగే సామాజిక ప్రయోజనాల కోసం టె క్నాలజీని ఉపయోగించుకునే దిశగా ఇన్ఫోసిస్, అల్కరాజ్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. ఏఐ ద్వారా టెన్నిస్‌ స్థాయిని మరింతగా పెంచాలన్న తమ లక్ష్య సాధన దిశగా ఆయనతో భాగస్వామ్యం కీలకమని ఇన్ఫీ తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement