 
															జయలలితకు రజనీకాంత్ లేఖ
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జైలు నుంచి విడుదల కావడం పట్ల సినీ నటుడు రజనీకాంత్ సంతోషం వ్యక్తం చేశారు.
	చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జైలు నుంచి విడుదల కావడం పట్ల సినీ నటుడు రజనీకాంత్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు జయలలితకు ఆయన ఆదివారం లేఖ రాశారు. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. జయలలితకు ముందుగానే రజనీకాంత్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
	
	ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 21 రోజులపాటు జైలుశిక్ష అనుభవించిన జయలలిత శనివారం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. చెన్నై చేరుకున్న జయకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. కాగా తన ప్రజాజీవితాన్ని 'మండుతున్న నదిలో ఈదులాట'గా జయలలిత వర్ణించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
