కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం కొంతమంది పారిశ్రామికవేత్తలను కలిశారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం కొంతమంది పారిశ్రామికవేత్తలను కలిశారు. యాక్సిస్ బ్యాంక్ సీఈవో శిఖా శర్మ, హిందూస్తాన్ యూనిలీవర్ మాజీ సీఈవో నితిన్ పరాంజపే తదితరులతో ఆయన తన నివాసంలో సమావేశమయ్యారు. రాహుల్ తన నివాసంలో పారిశ్రామికవేత్తలను కలుసుకోవడం బహుశా ఇది మొదటిసారని సంబంధిత వర్గాలంటున్నాయి.