మోదీ, వెంకయ్య, బాబుపై పీఎస్లో కేసులు పెడతాం | Raghuveera reddy takes on chandrababu | Sakshi
Sakshi News home page

మోదీ, వెంకయ్య, బాబుపై పీఎస్లో కేసులు పెడతాం

Aug 26 2015 2:37 PM | Updated on Aug 15 2018 2:20 PM

మోదీ, వెంకయ్య, బాబుపై పీఎస్లో కేసులు పెడతాం - Sakshi

మోదీ, వెంకయ్య, బాబుపై పీఎస్లో కేసులు పెడతాం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి బుధవారం అనంతపురంలో నిప్పులు చెరిగారు.

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి బుధవారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. ప్రత్యేక ప్యాకేజీ పేరుతో చంద్రబాబు ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారని ఆరోపించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను చూసి నేర్చుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 7,8,9 తేదీలలో ప్రధాని మోదీ,  కేంద్రమంత్రి వెంకయ్య, ముఖ్యమంత్రి చంద్రబాబుపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు పెడతామని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement