'అభిశంసనతో ట్రంప్ గద్దె దిగుతారు' | 'Prediction Professor' Who Called Donald Trump's Big Win Also Made Another Forecast: Trump Will Be Impeached | Sakshi
Sakshi News home page

'అభిశంసనతో ట్రంప్ గద్దె దిగుతారు'

Nov 12 2016 4:22 PM | Updated on Aug 25 2018 7:50 PM

'అభిశంసనతో ట్రంప్ గద్దె దిగుతారు' - Sakshi

'అభిశంసనతో ట్రంప్ గద్దె దిగుతారు'

డోనాల్డ్ ట్రంప్ దోషారోపణతో గద్దె దిగుతారని వాషింగ్టన్ కు చెందిన ప్రొఫెసర్ అల్లాన్ లిట్చ్ మాన్ చెప్పారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ దోషారోపణతో గద్దె దిగుతారని వాషింగ్టన్ కు చెందిన ప్రొఫెసర్ అల్లాన్ లిట్చ్ మాన్ చెప్పారు. ఇదే ప్రొఫెసర్ ట్రంపే అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తారని చెప్పడం కూడా గమనార్హం. రిపబ్లికన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ట్రంప్ ను తప్పించి మైక్ పెన్స్ ను ఆ స్ధానంలో నిలబెడుతుందని పేర్కొన్నారు. 

 

ట్రంప్ అధ్యక్షపదవిని చేపట్టడం రిపబ్లికన్లకు ఇష్టం లేదని చెప్పారు. ట్రంప్ ను అదుపు చేయడం వారి వల్ల కాదని, ఆయనేప్పుడు ఎలా ప్రవర్తిస్తారో రిపబ్లికన్లు ఊహించలేకపోతున్నారని తెలిపారు. దీంతో మైక్ పెన్స్ ను అధ్యక్ష స్ధానంలో నిలబెట్టాలనే ఆలోచన వారిలో ఉందని చెప్పారు. పెన్స్ కు రిపబ్లికన్లలో మంచి పేరుంది. అధ్యక్ష పదవి చేపట్టిన ఏడాది కాలంలోపే దేశ శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తించి ట్రంప్ గద్దె దిగే అవకాశం ఉందని తెలిపారు.

 

ట్రంప్ దోషారోపణతో గానీ లేదా రాజీనామా చేసి గానీ అధ్యక్షపదవి నుంచి వైదొలుగుతారని న్యూయార్క్ టైమ్స్ కు చెందిన డేవిడ్ బ్రూక్స్ కూడా పేర్కొన్నారు. లిట్చ్ మాన్ 1984 నుంచి ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యే వారి పేర్లను కచ్చితంగా చెబుతూ వస్తున్నారు. అయితే 2000లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో లిట్చ్ మాన్ ఊహించినట్లు జరగలేదు.

Advertisement
 
Advertisement
Advertisement