సంస్కరణలను అత్యంత వేగవంతంగా అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
న్యూఢిల్లీ: సంస్కరణలను అత్యంత వేగవంతంగా అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. వ్యాపార వర్గాలు, పెట్టుబడులకు ప్రోత్సాహమిచ్చేలా పన్నుల విధానాల్లో స్థిరత్వం తెస్తామని, నియంత్రణ వ్యవస్థల్లో మార్పులు తెస్తామని శుక్రవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. ‘నేను వేగాన్ని విశ్వసిస్తాను. దానికి అనుగుణంగానే శరవేగంగా మార్పులు అమల్లోకి తెస్తాను. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించేలా సంస్కరణలను టాప్ స్పీడ్‌లో చేపడుతున్నాం. పెట్టుబడులకు అవరోధాలుగా ఉంటున్న బహుళ క్లియరెన్స్‌ల విధానాన్ని సరళతరం చేస్తున్నాం’ అని మోదీ తెలిపారు. ఒకవైపు రైతుల ప్రయోజనాలు పరిరక్షిస్తూనే మరో వైపు ఇన్‌ఫ్రా, తయారీ రంగాలకు ఊతమిచ్చేలా ఉన్నాయని మోదీ పేర్కొన్నారు.