breaking news
Top Speed
-
గాల్లో తేలే రైళ్లు.. గంటకు 600కిమీ వేగం..!
బీజింగ్: చైనా 600 కిలోమీటర్ల వేగంతో వెళ్లే మాగ్లెవ్ రైలును లాంచ్ చేసింది. ఈ రైళ్లతో బీజింగ్ నుంచి షాంఘైకి వెయ్యి కిలోమీటర్ల దూరాన్ని కేవలం రెండున్నర గంటల్లో చేరుకోవచ్చునని ఒక ప్రకటనలో తెలిపింది. ఒకవేళ విమానంలో వెళ్తే సుమారు 3 గంటల సమయం పట్టనుంది. విమానం కంటే వేగంగా మాగ్లెవ్ రైలు వెళ్లనుంది. ఖింగ్దావ్‌లో చైనా ఈ రైలును అభివృద్ధి చేసింది. గాల్లో తేలే రైళ్లు.. సాధారణ రైళ్లకు, మాగ్లెవ్ రైళ్లకు చాలా వ్యత్యాసం ఉంది. సాధారణ రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తాయి. కానీ ఈ మాగ్లెవ్ రైళ్లకు పట్టాలున్నా.. పట్టాలపై పరుగులు తీయదు. పట్టాలకు తాకకుండా విద్యుదయస్కాంత శక్తితో గాల్లో కొంత ఎత్తులో రైలు నడుస్తుంది. చైనా గత రెండు దశబ్దాలుగా మాగ్లెవ్ రైళ్ల టెక్నాలజీను ఉపయోగిస్తుంది. పరిమిత సంఖ్యలో మాగ్లెవ్ చైనాలో నడుస్తున్నాయి. జపాన్, జర్మనీ వంటీ దేశాలు మాగ్లెవ్ రైలును అభివృద్ది చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. -
7.3 శాతం వృద్ధి.. ఇదే టాప్ స్పీడ్!
► భారత్‌పై ఐక్యరాజ్యసమితి నివేదిక ► వచ్చే ఏడాది 7.5 శాతానికి చేరుతుందని అంచనా న్యూఢిల్లీ: భారత్ 2016 ఆర్థికాభివృద్ధి అంచనాలను ఐక్యరాజ్యసమితి (యూఎన్) పదిహేను రోజుల్లో మరోసారి తగ్గించింది. ఇప్పటివరకూ 7.5 శాతంగా ఉన్న ఈ అంచనా రేటును తాజాగా 7.3 శాతానికి కుదించింది. సంస్కరణల అమల్లో జాప్యం కారణాన్ని చూపుతూ పక్షం రోజుల క్రితం 8.2 శాతం అంచనాను యూఎన్ ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ (ఆసియా-పసిఫిక్) ఈ నివేదిక 7.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. తాజా నివేదికతో ఈ అంచనాను 7.3 శాతానికి తగ్గించినట్లయ్యింది. అయితే ఈ స్థాయి వృద్ధిని సైతం ప్రపంచంలోని ఏ దేశం సాధించే పరిస్థితి లేదని పేర్కొన్న ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక.. దేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా పేర్కొంది. రెండు రోజుల క్రితం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) విడుదల చేసిన అంచనాలు సైతం 7.3 శాతం గమనార్హం. ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితులు... 2016 అవకాశాలు’ అన్న పేరుతో విడుదలైన తాజా ఐక్యరాజ్యసమితి నివేదికను చూస్తే... భారత్ వృద్ధి రేటు వచ్చే ఏడాది 7.5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణాసియా స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో భారత్ ఆర్థిక వ్యవస్థ వాటా 70%. 2015లో దేశం వృద్ధి 7.2 శాతం. 2016, 2017ల్లో దక్షిణాసియాలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థల తరహాలోనే భారత్‌లో ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి స్థూల ఆర్థిక అంశాలు అదుపులో ఉన్నాయి. కమోడిటీ, మెటల్, ఆహార ధరల తగ్గుదల దీనికి కారణం. పరిశ్రమల మందగమనం, సంస్కరణల అమల్లో వేగం లేకపోవడం, అడ్డంకులు వంటి సవాళ్లను ప్రభుత్వం ఎదుర్కొంటున్నా... విని యోగ, పెట్టుబడిదారు విశ్వాసం పెరిగింది. మౌలిక, విద్య, ఆరోగ్య రంగాలపై ప్రభుత్వ పెట్టుబడులు తక్కువగా ఉన్నాయి. వీటిని మరింత పెంచాల్సిన అవసరం ఉంది. పారిశ్రామిక ఉత్పత్తి మందగమనం, వ్యవసాయ రంగంలో అననుకూల పరిస్థితులు ఆందోళనకరమే. వృద్ధి మరింత పటిష్టంగా, సుస్థిరంగా మారాల్సిన అవసరం ఉంది. క్రమ వృద్ధి తీరు: మోర్గాన్‌స్టాన్లీ భారత్ వృద్ధి సంకేతాలనే ఇస్తున్నట్లు ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ నివేదిక తెలిపింది. రానున్న రెండేళ్లలో రిటైల్ ద్రవ్యోల్బణం కూడా ఐదు శాతం దిగువన ఉండే అవకాశం ఉందని అంచనావేసింది. వినియోగం, ప్రభుత్వ రంగ పెట్టుబడులు, విదేశీ ప్రైవేటు పెట్టుబడుల రాక వంటి అంశాలు భారత్ వృద్ధి ధోరణికి మద్దతుగా నిలుస్తున్న అంశాలని వివరించింది. డిసెంబర్లో ఐఐపీ 5 శాతం: డీఅండ్‌బీ ప్రస్తుతం తీవ్ర నిరాశ కలిగిస్తున్న దేశ పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) డిసెంబర్లో మాత్రం 4 నుంచి 5 శాతం వరకూ వృద్ధి సాధించే అవకాశం ఉందని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీఅండ్‌బీ) తాజా నివేదిక అంచనావేసింది. అయితే బేస్ ఎఫెక్ట్ దీనికి ప్రధాన కారణంగా తెలిపింది. పెట్టుబడులు పెరగడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా మరొక కారణంగా నిలుస్తాయని తెలిపింది. -
టాప్ స్పీడ్‌లో సంస్కరణలు
న్యూఢిల్లీ: సంస్కరణలను అత్యంత వేగవంతంగా అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. వ్యాపార వర్గాలు, పెట్టుబడులకు ప్రోత్సాహమిచ్చేలా పన్నుల విధానాల్లో స్థిరత్వం తెస్తామని, నియంత్రణ వ్యవస్థల్లో మార్పులు తెస్తామని శుక్రవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. ‘నేను వేగాన్ని విశ్వసిస్తాను. దానికి అనుగుణంగానే శరవేగంగా మార్పులు అమల్లోకి తెస్తాను. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించేలా సంస్కరణలను టాప్ స్పీడ్‌లో చేపడుతున్నాం. పెట్టుబడులకు అవరోధాలుగా ఉంటున్న బహుళ క్లియరెన్స్‌ల విధానాన్ని సరళతరం చేస్తున్నాం’ అని మోదీ తెలిపారు. ఒకవైపు రైతుల ప్రయోజనాలు పరిరక్షిస్తూనే మరో వైపు ఇన్ఫ్రా, తయారీ రంగాలకు ఊతమిచ్చేలా ఉన్నాయని మోదీ పేర్కొన్నారు.