కంగ్రాట్స్.. సుందర్ పిచాయ్: మోదీ | PM congratulates new Google chief Sundar Pichai | Sakshi
Sakshi News home page

కంగ్రాట్స్.. సుందర్ పిచాయ్: మోదీ

Aug 11 2015 2:22 PM | Updated on Aug 15 2018 2:20 PM

కంగ్రాట్స్.. సుందర్ పిచాయ్: మోదీ - Sakshi

కంగ్రాట్స్.. సుందర్ పిచాయ్: మోదీ

ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ కొత్త సీఈవోగా నియమితులైన సుందర్ పిచాయ్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.

న్యూఢిల్లీ: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ కొత్త సీఈవోగా నియమితులైన సుందర్ పిచాయ్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గూగుల్లో కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలంటూ మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

తమిళనాడు రాజధాని చెన్నైలో సుందర్ 1972లో జన్మించారు. పిచాయ్ 2004 లో గూగుల్ లో చేరి అంచెలంచెలుగా ఎదిగి సీఈఓ స్థాయికి చేరారు. సుందర్ పిచాయ్ని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యానాదెళ్ల, ఆంధ్రపదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్లు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement