శివసేన ఎమ్మెల్యే హఠాన్మరణం | Palghar MLA Krushna Ghoda dies of heart attack | Sakshi
Sakshi News home page

శివసేన ఎమ్మెల్యే హఠాన్మరణం

May 24 2015 11:03 AM | Updated on Sep 3 2017 2:37 AM

శివసేన ఎమ్మెల్యే కృశాన్ ఘొడా(61) హఠ్మానరణం చెందారు. గుండెపోటులో ఆదివారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు.

పాల్గార్: శివసేన ఎమ్మెల్యే కృశాన్ ఘొడా(61) హఠ్మానరణం చెందారు. గుండెపోటులో ఆదివారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. మహారాష్ట్రలోని పాల్గార్ జిల్లా దహాను అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన ప్రాతనిథ్యం వహిస్తున్నారు. పాల్గార్ జిల్లాలో ఓ పెళ్లికి హాజరయి తిరిగి వస్తుండగా చరోటి చెక్ పోస్టుకు సమీపంలో తెల్లావారుజామున 2 గంటల ప్రాంతంలో ఆయనకు గుండెపోటు వచ్చింది.

వెంటనే వాపి ప్రాంతంలోని హరియా ఆస్పత్రికి ఆయనను తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. కృశాన్ ఘోడా అంత్యక్రియలు ఆయన స్వగ్రామం రణషీత్ లో నిర్వహించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement