ఈ యుద్ధంలో మీరు ఓ జవానుగా మారతారా? | Opposing demonetisation against country's interest: Devendra Fadnavis | Sakshi
Sakshi News home page

ఈ యుద్ధంలో మీరు ఓ జవానుగా మారతారా?

Nov 21 2016 3:32 PM | Updated on Sep 4 2017 8:43 PM

ఈ యుద్ధంలో మీరు ఓ జవానుగా మారతారా?

ఈ యుద్ధంలో మీరు ఓ జవానుగా మారతారా?

పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన నిర్ణయాన్ని వ్యతిరేకించడమంటే, దేశానికి నష్టం చేకూర్చడమేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు.

ముంబై : పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన నిర్ణయాన్ని వ్యతిరేకించడమంటే, దేశానికి నష్టం చేకూర్చడమేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. బ్లాక్మనీకి వ్యతిరేకంగా ఆర్థిక స్వేచ్ఛ కోసం  చేస్తున్న ఈ యుద్ధంలో ప్రజలందరూ కలిసి కట్టుగా ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపునిచ్చిన ఈ యుద్ధంలో వచ్చే 50 రోజులు మోదీజి వెంట నడిచే వారు జవానుగా పరిగణించబడతారని, ప్రధాని నిర్ణయాన్ని విమర్శించేవారు దేశ వ్యతిరేకులని అభివర్ణించారు. మహారాష్ట్రలో జరుగునున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన తీరప్రాంతం కొంకణ్లోని రత్నగిరిలో ఆదివారం ప్రచార ర్యాలీ నిర్వహించారు.
 
 
ఎకనామిక్ ఫ్రీడం కోసం ప్రస్తుతం జరుగుతున్న ఈ యుద్ధంలో మీరు ఓ జవానుగా మారతారా లేదా దేశ విద్రోహక్గా మారాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలన్నారు. తామందరం  వచ్చే యాభై రోజులు మోదీజికి వెన్నుదన్నుగా నిల్చొని, బ్లాక్మనీకి వ్యతిరేకంగా పోరాడతామన్నారు. అవినీతిని కూకటివేళ్లతో బయటకు రాబట్టి, బ్లాక్మనీని నిర్మూలించడానికి ప్రభుత్వం నవంబర్ 8న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement