'ప్రజల తిండి విషయంలో జోక్యం చేసుకోం' | No interference in people's choice of food: Mamata | Sakshi
Sakshi News home page

'ప్రజల తిండి విషయంలో జోక్యం చేసుకోం'

Sep 21 2015 5:40 PM | Updated on Oct 8 2018 5:45 PM

'ప్రజల తిండి విషయంలో జోక్యం చేసుకోం' - Sakshi

'ప్రజల తిండి విషయంలో జోక్యం చేసుకోం'

ముంబయిలో మాంసంపై నిషేధం విధించడంపట్ల విమర్శలు చేస్తున్నవారి సరసన పరోక్షంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేరారు.

కోల్కతా: ముంబయిలో మాంసంపై నిషేధం విధించడంపట్ల విమర్శలు చేస్తున్నవారి సరసన పరోక్షంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేరారు. తమ ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో ఏ మాత్రం జోక్యం చేసుకోదని చెప్పారు. ఏం తినాలనేది నిర్ణయించుకునేది ప్రజలే తప్ప ప్రభుత్వ పరంగా నిర్ణయించలేమని, నిర్ణయించకూడదని అన్నారు.

ఎవరు ఏం తినాలో వారి స్వయం నిర్ణయం అని చెప్పారు. సోమవారం మైనారిటీ డెవలప్మెంట్ శాఖ నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రస్తావించకుండానే తాను తన రాష్ట్రంలో విభజించి పాలన చేయనని, అందరికీ సమాన హక్కులు ఉండాలనే ఉద్దేశంతోనే పనిచేస్తానని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement