ఐర్లాండ్ చేరుకున్న ప్రధాని మోదీ | Narendra Modi arrives in ireland | Sakshi
Sakshi News home page

ఐర్లాండ్ చేరుకున్న ప్రధాని మోదీ

Sep 23 2015 3:54 PM | Updated on Aug 15 2018 6:34 PM

ఐర్లాండ్ చేరుకున్న ప్రధాని మోదీ - Sakshi

ఐర్లాండ్ చేరుకున్న ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐర్లాండ్ చేరుకున్నారు.

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐర్లాండ్ చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో మోదీ బృందం ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ చేరుకుంది.

60 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఐర్లాండ్ లో పర్యటిస్తున్న భారత ప్రధానిగా నరేంద్ర మోదీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆ దేశ ప్రభుత్వాధినేత (తెషెక్) ఎన్డా కెన్నీతో మోదీ సమావేశమవుతారు.  ఐర్లాండ్లోని భారత సంతతి ప్రజలతో మోదీ కొద్దిసేపు సమావేశమవుతారు. ఈ రోజు సాయంత్రం మోదీ అక్కడి నుంచి న్యూయార్క్ బయల్దేరి వెళతారు.  అమెరికా పర్యటనలో భాగంగా ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రధాని ప్రసంగిస్తారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆతిథ్యమిస్తున్న శాంతిపరిరక్షణపై ఐరాస సదస్సులో పాల్గొంటారు.

Advertisement
 
Advertisement
Advertisement