అబద్ధాలు చెప్పడంలో చంద్రబాను మించినవారు లేనేలేరని వైఎస్సార్ సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు.
బాబు కోరిక మేరకు ఎన్టీఆర్ పార్టీ పెట్టారా!
Sep 11 2016 8:42 PM | Updated on May 29 2018 4:26 PM
నెల్లూరు: అబద్ధాలు చెప్పడంలో చంద్రబాను మించినవారు లేనేలేరని వైఎస్సార్ సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. 'నేను కోరినందువల్లే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు' అని చంద్రబాబు ప్రచారం చేసుకోవడం దారుణమని మండిపడ్డారు. అలా చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు.
ఆదివారం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన నల్లపురెడ్డి.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మోసం చేశారన్నారు. చంద్రబాబు తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధిని తాకట్టుపెట్టారని విమర్శించారు.
Advertisement


