300 మీటర్లు కారుతో ఈడ్చుకెళ్లాడు | Mumbai: Man driven 300 metres while hanging on to car's bonnet in chilling road rage case | Sakshi
Sakshi News home page

300 మీటర్లు కారుతో ఈడ్చుకెళ్లాడు

Aug 12 2015 6:31 PM | Updated on Aug 30 2018 3:51 PM

300 మీటర్లు కారుతో ఈడ్చుకెళ్లాడు - Sakshi

300 మీటర్లు కారుతో ఈడ్చుకెళ్లాడు

నవీ ముంబయిలో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన చోటుచేసుకుంది. అచ్చం సినిమాలో చూసినట్లుగా సీసీటీవీ కెమెరాల్లో ఓ దృశ్యం ఆవిష్కృతమైంది.

ముంబయి: నవీ ముంబయిలో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన చోటుచేసుకుంది. అచ్చం సినిమాలో చూసినట్లుగా సీసీటీవీ కెమెరాల్లో ఓ దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ కారు డ్రైవర్ అతడి కారుపై మరో వ్యక్తి వేలాడుతున్నా ఏమాత్రం లక్ష్య పెట్టకుండా దాదాపు 300 మీటర్లు నడిపాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కి అరెస్టయ్యాడు. అసలు విషయానికి వస్తే నవీ ముంబయిలో ఓ కారు డ్రైవర్ రోడ్డు పక్కన ఉన్న ఓ వ్యక్తితో, బస్సు డ్రైవర్తో గొడవపడ్డాడు.

అనంతరం చేయి కూడా చేసుకున్నాడు. ఆ వెంటనే ఆ ప్రాంతం విడిచి పారిపోయేందుకు కారు డ్రైవర్ ప్రయత్నం చేస్తుండగా బస్సు డ్రైవర్ వెళ్లి ఏకంగా కారు ముందు భాగంపై దూకాడు. అయినా, అతడు కారు వేగంతో ముందుకు పోనివ్వడంతో బస్సు డ్రైవర్ కిందపడకుండా కారు వైపర్ సహాయంతో ఆగి ప్రాణాలు దక్కించుకున్నాడు. చివరకు కారు 300 మీటర్లు దూసుకెళ్లి ఆగింది. కారు నడిపిన ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. బస్సు డ్రవైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement