గవర్నర్గిరిపై నాకే క్లారిటీ లేదు | Motkupalli Narasimhulu comments on the Governor post | Sakshi
Sakshi News home page

గవర్నర్గిరిపై నాకే క్లారిటీ లేదు

Sep 12 2016 7:29 PM | Updated on Aug 29 2018 4:18 PM

గవర్నర్గిరిపై నాకే క్లారిటీ లేదు - Sakshi

గవర్నర్గిరిపై నాకే క్లారిటీ లేదు

గవర్నర్గిరిపై నాకే క్లారిటీ లేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.

గవర్నర్ పదవిపై తనకే క్లారిటీలేదని, వచ్చినప్పుడు విషయం చెబుతానని మాజీ మంత్రి, టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. సోమవారం నల్లగొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలు, మండలాల విభజన శాస్త్రీయంగా జరగడం లేదని ఫలితంగా ప్రజలకు ఇబ్బందులు తప్పవన్నారు. యాదగిరిగుట్టను జిల్లాగా చేయడం శుభపరిణామమన్నారు. మండల వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కిందన్నారు. ఆలేరు నియోజకవర్గంలోని గుండాల, ఆలేరు, రాజాపేట మండలాలను జనగాం డివిజన్‌లో కలపొద్దన్నారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చినట్లు చెప్పారు.

 

Advertisement
 
Advertisement
Advertisement