ఘోర రోడ్డు ప్రమాదం; 15 మందికి పైగా మృతి | More than 15 people killed in a road accident in Rajasthan | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం; 15 మందికి పైగా మృతి

Mar 3 2017 1:39 PM | Updated on Aug 30 2018 4:10 PM

ఘోర రోడ్డు ప్రమాదం; 15 మందికి పైగా మృతి - Sakshi

ఘోర రోడ్డు ప్రమాదం; 15 మందికి పైగా మృతి

రాజస్థాన్‌లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమాన్‌గఢ్ సమీపంలో ఎదురుగా వస్తున్న జీపు, ట్రక్కు ఢీకొన్నాయి.

జైపూర్: రాజస్థాన్‌లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమాన్‌గఢ్ సమీపంలో ఎదురుగా వస్తున్న జీపు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మందికిపైగా మరణించారు. జీపులో ఉన్నవారు అక్కడికక్కడే మరణించారు. ప్రమాద స్థలిలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి.

ఢీకొన్ని తర్వాత ట్రక్కు బోల్తాపడగా, జీపు నుజ్జునుజ్జయ్యింది. జీపు టైర్లు, ఇతర భాగాలు విడిపోయి కుప్పలా పడ్డాయి. స్థానికులు ప్రమాద స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement
 
Advertisement
Advertisement