మంటల వదంతులు.. ఆగిన మెట్రో రైలు | Metro services hit after passengers report fire incident | Sakshi
Sakshi News home page

మంటల వదంతులు.. ఆగిన మెట్రో రైలు

Apr 11 2014 3:34 PM | Updated on Sep 5 2018 9:45 PM

ఢిల్లీ మెట్రో రైల్లో అగ్నిప్రమాదం జరిగినట్లు కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో మెట్రో రైలు సర్వీసులు దాదాపు అరగంట పాటు నిలిచిపోయాయి.

ఢిల్లీ మెట్రో రైల్లో అగ్నిప్రమాదం జరిగినట్లు కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో మెట్రో రైలు సర్వీసులు దాదాపు అరగంట పాటు నిలిచిపోయాయి. అర్జన్గఢ్- ఘితోర్ని మధ్య నడిచే మెట్రో రైలు జహంగీర్పురి నుంచి హుడా సిటీ సెంటర్ మధ్య ప్రాంతంలో ఉండగా ఈ సంఘటన జరిగింది. మధ్యాహ్నం 1.04 గంటల సమయంలో రైల్లోని చివరి బోగీలో కొంతమంది ప్రయాణికులు నిప్పు రవ్వలు, పొగ చూశారు. వెంటనే వాళ్లు డ్రైవర్కు సమాచారం అందించగా డ్రైవర్ అత్యవసర బ్రేకులు వాడి రైలును ఆపేశారు.

అయితే, బోగీలో పూర్తిగా పరిశీలించగా మంటలు ఏవీ రాలేదని తేలింది. అయినా రైలును మాత్రం తదుపరి పరీక్షల కోసం సర్వీసు నిలిపివేశారు. మంటలు కనిపించకపోయినా.. నిప్పు నెరుసులు ఎగసిన మాట మాత్రం వాస్తవమేనని ప్రాథమిక విచారణలో తేలింది. రైలుకు గానీ, ప్రయాణికులకు గానీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని మెట్రో రైలు అధికార ప్రతినిధి తెలిపారు. అరగంట తర్వాత రైలు రాకపోకలను పునరుద్ధరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement